చోరీలు చేస్తూ పట్టుబడిన బీటెక్ విద్యార్థి | BTech student caught the scene of the crime | Sakshi
Sakshi News home page

చోరీలు చేస్తూ పట్టుబడిన బీటెక్ విద్యార్థి

Published Sat, Dec 19 2015 12:30 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

BTech student caught the scene of the crime

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణానికి బీటెక్ విద్యార్థి దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. మదనపల్లె నీరుగట్టుపల్లెకు చెందిన రాజేష్ నెల్లూరులో ట్రిపుల్ ఈ చదువుతున్నాడు. నెల్లూరు నగరంతో పాటు మదనపల్లెకు వచ్చినపుడు ఇళ్లలో జొరబడి చోరీలు చేయడం అతనికి అలవాటు. విలువైన ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, సెల్‌ఫోన్లు, నగలు, నగదు చోరీ చేసేవాడు.

శనివారం ఉదయం మదనపల్లెలో ఉండగా అతనిని పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువైన ల్యాప్‌టాప్‌లు, నగలు, ఒక స్కూటర్ స్వాదీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement