సాక్షి, అమరావతి : పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 400 కోట్లు అవినీతి జరిగినట్లు కాగ్ నివేదికలో వెల్లడైందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరంను పక్కన పెట్టి తాత్కాలిక ప్రాజెక్టు పట్టిసీమ కట్టారని తెలిపారు. పోలవరం కట్టే బాధ్యత కేంద్రానికి ఉన్నా కూడా ప్యాకేజీల కోసం టీడీపీ తెచ్చుకుందని అన్నారు. పట్టిసీమ బదులు పోలవరం పనులు వేగవంతం చేస్తే ఇప్పటికే పూర్తయ్యేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేశారని అన్నారు. విద్యుత్ సంస్థలకు రూ. 10 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment