నేడు సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎమ్ఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల జేఏసీ ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ జేఏసీ కన్వీనర్ కన్నబాబు బుధవారం ఇక్కడ వెల్లడించారు.అందులో భాగంగా నేటి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
జేఏసీ ఆధ్వర్యంలో తణుకులతో రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు, అలాగే రహదారిపై వంటావార్పు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు లక్ష గళ గర్జన నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఎమ్ఎస్ఓలు, కేబులు ఆపరేటర్లు బుధవారం తమ జేఏసీ కన్వీనర్గా తణుకు ఎమ్ఎస్ఓ కన్నబాబును ఎన్నుకున్నారు.