‘రాజధాని’లో నిరసనల వెల్లువ
అభ్యంతర పత్రాలు తీసుకోకపోవడంపై ఆగ్రహం
గుంటూరు : గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో రైతులు నిర్వహించిన ధర్నాలతో ఆ గ్రామాలు దద్దరిల్లాయి. భూ సమీకరణకు వ్యతిరేకంగా రైతులు ఇస్తున్న అభ్యంతర పత్రాలను అధికారులు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారంమంగళగిరి మండలం నవులూరు, యర్రబాలెం రైతులు 9.2 ఫారాలు ఇచ్చేందుకు స్థానిక సీఆర్‌డీఏ కార్యాలయాలకు వెళ్లారు.
అయితే అధికారులు మధ్యాహ్నం వరకు వాటిని తీసుకోలేదు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగారు. చివరకు సీఆర్‌డీఏ అధికారులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను ఫోన్‌లో సంప్రదించి, వారినుంచి అనుమతి తీసుకుని అభ్యంతర పత్రాలు తీసుకున్నారు.