అవినీతికి కేరాఫ్ ‘బాబు’ | Care of corruption 'Babu' | Sakshi
Sakshi News home page

అవినీతికి కేరాఫ్ ‘బాబు’

Published Sat, Jun 13 2015 4:47 AM | Last Updated on Tue, Oct 30 2018 4:56 PM

Care of corruption 'Babu'

నిజాయితీతో ఎప్పుడు పదవులు అనుభవించారు?
ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపాటు

 వెదురుకుప్పం : అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కే.నారాయణస్వామి మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని పచ్చికాపల్లంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి నిర్వచనం తెలియని ‘చంద్రబాబూ’ ఇతరులపై నిందలు మోపడం నీకు అలవాటై అయిపోయిందని ధ్వజమెత్తారు. ఆంధ్ర అన్నా హాజరే అంటూ బీరాలు పలికిన నువ్వు.. ఓటుకు నోటుతో పదవులు పొందాలను కోవడం దేనికి సంబంధించిందో చెప్పాలని ప్రశ్నించారు.

నీ రాజకీయ అనుభవంలో నీతి, నిజాయితీతో ఎప్పుడు పదవులు అనుభవించావని నిలదీశారు. నీవు నీతిమంతుడైతే ఢిల్లీకి వెళ్లి కుట్ర రాజకీయాలు ఎందుకు చేస్తున్నావో అర్థం కావడం లేదన్నారు. నోటుకు ఓటు కేసులో తప్పించుకోవడం నీ తరం కాదు కాబట్టే అడ్డదారులు తొక్కుతున్నావని అన్నారు. నీకు, నీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని జోస్యం చెప్పారు. ఎల్లో మీడియాలో ఉత్తుత్తి కథనాలతో ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నావవంటూ ఆరోపించారు.

నీకు దమ్ముంటే మీ సచ్చీలతను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండి గోవర్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ మాధవరావు, ఎంపీపీ పురుషోత్తం, మండల పార్టీ అధ్యక్షుడు పేట ధనంజేయులు రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సుకుమార్, ఎంపీటీసీలు జయరామ మందడి, రోశిరెడ్డి,నాయకులు మునస్వామి, సర్పంచ్ బాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement