అలరించిన అన్నమయ్య కీర్తనలు | Catering Annamayya songs | Sakshi
Sakshi News home page

అలరించిన అన్నమయ్య కీర్తనలు

Published Mon, Dec 15 2014 2:43 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

అలరించిన అన్నమయ్య కీర్తనలు - Sakshi

అలరించిన అన్నమయ్య కీర్తనలు

అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో ఆదివారం శ్రీ నృత్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య అష్టోత్తర శత సంకీర్తనార్చన ఆకట్టుకుంది. 150 మంది కళాకారుల గాత్రాలతో ఏకధాటిగా 108 అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.

ఏకరూప వస్త్రధారణతో గాయనీమణులు తమదైన గాత్రమాధుర్యంతో ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విద్యార్థులు ఏకధాటిగా అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డులో నమోదు చేయడానికి ‘అనంత’కు విచ్చేసిన నిర్వాహకులు చిన్నారుల గళాలకు తాము ముగ్ధులైనట్లు ప్రకటించారు.      

- అనంతపురం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement