సీబీఐకి చిక్కిన రైల్వే సీనియర్ సెక్షన్ ఆఫీసర్ | CBI arrests Senior Section Officer, Southern Railway | Sakshi
Sakshi News home page

సీబీఐకి చిక్కిన రైల్వే సీనియర్ సెక్షన్ ఆఫీసర్

Published Thu, Jul 9 2015 5:32 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

CBI arrests Senior Section Officer, Southern Railway

గుంతకల్లు (అనంతపురం జిల్లా) : పాత బిల్లుల మంజూరుకు రూ. 40వేలు లంచం తీసుకుంటూ గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎమ్ కార్యాలయంలో సీనియర్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న తేజోరావు సీబీఐకి చిక్కాడు. గురువారం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎమ్ కార్యాలయంపై దాడి చేసిన సీబీఐ అధికారులు అతన్ని పట్టుకున్నారు.

గుంతకల్లులోని సంతోష్ ఎలక్ట్రికల్ దుకాణం యజమాని పాత బిల్లుల మంజూరు కోసం తేజోరావును సంప్రదించగా రూ.40వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో దుకాణ యజమాని సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. సీబీఐ అధికారులు పథకం వేసి దుకాణ యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా తేజోరావును ప్రత్యక్షంగా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement