పీఎన్‌బీ స్కామ్‌: లంచంగా ఏమిచ్చాడంటే.. | CBI Confirms Nirav Modi Bribed PNB Officials | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 4 2018 9:28 AM | Last Updated on Sun, Mar 4 2018 10:02 AM

CBI Confirms Nirav Modi Bribed PNB Officials - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీ స్కామ్‌లో అధికారులు విస్తుపోయే విషయాలను వెల్లడిస్తున్నారు. బ్యాంక్‌ అధికారుల సాయంతోనే ఈ బడా కుంభకోణం చోటు చేసుకుందని సీబీఐ నిర్ధారణకు వచ్చింది. నీరవ్‌ మోదీ నుంచి బ్యాంక్‌ అధికారులు బంగారం కాయిన్లు, డైమండ్‌ నగలను లంచంగా తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. శనివారం ఈ విషయాన్ని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. 

ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్ట్‌ చేసిన సీబీఐ వారిని విడివిడిగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సిబ్బంది నీరవ్‌ మోదీ నుంచి లంచం స్వీకరించినట్లు తెలిపింది. ముంబై బ్రాంచ్‌ ఫోరెక్స్‌ విభాగపు మేనేజర్‌ యశ్వంత్‌ జోషి నీరవ్‌ మోదీ నుంచి 60 గ్రాముల చేసే రెండు బంగారు కాయిన్లను, ఒక జత గోల్డ్‌, డైమండ్‌ ఇయర్‌ రింగ్స్‌ను తీసుకున్నట్లు అంగీకరించినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. వీరితోపాటు మరికొందరు కూడా తాము లంచం స్వీకరించినట్లు అంగీకరించారు.

దీంతో బ్యాంక్‌ సిబ్బంది సహకారంతోనే ఈ బడా స్కామ్‌ చోటు చేసుకున్నట్లు సీబీఐ స్పష్టతకు వచ్చింది. జోషితోపాటు మరో నలుగురు పీఎన్‌బీ అధికారులు, ఇద్దరు బ్యాంక్‌ అడిటర్లు, మోదీ సహయకుడు ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే రూ.12,600 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో ముంబై కోర్టు మోదీ, చోక్సీలపై నాన్‌ బెయిల్‌బుల్‌ వారంట్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement