
మంత్రి గీతారెడ్డికి సిబిఐ కోర్టు సమన్లు
హైదరాబాద్: లేపాక్షి నాలెడ్జి ఛార్జిషీట్ను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డితోపాటు మరికొందరికి కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 15న కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేటు లిమిటెడ్‌కు భూ కేటాయింపుల వ్యవహారంలో గీతారెడ్డిని ఆగస్టు 27న సీబీఐ విచారించింది. గీతారెడ్డితోపాటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరుని కూడా సీబీఐ చార్జిషీట్‌లో పొందుపర్చిన విషయం తెలిసిందే. 2004-09లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన గీతారెడ్డిని ఏ-9గా సిబిఐ ఛార్జిషీట్లో పేర్కొంది. ఈ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.