- నేడు స్పిల్ వే కాంక్రీట్ పనులకు సీఎం శంకుస్థాపన
- 7న డయాఫ్రమ్ వాల్, 14న స్పిల్‌వే గేట్ల పనులు ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచేసి.. కమీషన్లు ఇచ్చే వారికే నామినేషన్ పద్ధతిలో పనులు కట్ట బెట్టిన సీఎం చంద్రబాబు తన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి తనదైన శైలిలో ప్రచారానికి తెర తీశారు. బడ్జెట్‌లో ప్రత్యే కంగా నిధులు కేటాయించి కేంద్రమే పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుకు.. తన వల్లే నాబార్డు రూ.1981.54 కోట్ల రుణం మంజూరు చేసిందంటూ ఈ నెల 26న ఢిల్లీలో కేక్‌లు కట్ చేసి.. సంబరాలు చేసుకోవడం అందులో భాగమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవు తోంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం 1.59 గంటలకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ఎం.వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కాంక్రీట్ పనుల శంకుస్థాపనను ఘనంగా నిర్వహిం చేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లు రావా ల్సిందిగా సీఎం కార్యాలయం గురువారం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బస్సులను ఏర్పాటు చేశామని, అఖిల భారత సర్వీసు అధికారు లందరూ ఆ బస్సుల్లో ఎక్కి పోలవరం రావా ల్సిందిగా సీఎం కార్యాలయం పేర్కొంది.
అంచనా వ్యయంలో పెంపు, కమీషన్లు ఇచ్చే వారికి పనులు అప్పగింతలాంటి అక్రమాల ను కప్పిపుచ్చుకోవడానికే భారీ ప్రచార కార్యక్రమానికి తెర తీశారని అధికారులే విమర్శిస్తున్నారు. శుక్రవారం పోలవరం స్పిల్ వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేయడం, జనవరి 7న డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు, 14న స్పిల్ వే గేట్ల పనుల ప్రారంభ సంబరాలు నిర్వహించడం అందులో భాగమే నని చెబుతున్నారు. ఇందులో అఖిల భారత సర్వీసు అధికారులను భాగస్వామ్యం చేయా లని చూడటాన్ని పలువురు అధికారులు తప్పుపడుతున్నారు. సాధారణంగా ప్రాజెక్టు కు శంకుస్థాపన చేయడం.. జాతికి అంకితం చేసే కార్యక్రమాలనే ఘనంగా నిర్వహిస్తారని వారు చెబుతుండటం గమనార్హం.
అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే సంబరాలు
Published Fri, Dec 30 2016 1:33 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement