న్యాల్‌కల్, న్యూస్‌లైన్:
మండలంలోని రేజింతల్ గ్రామ శివారులో గల శ్రీసిద్ధి వినాయక ఆల యం భక్తజనసంద్రమైంది. నాలుగు రోజులుగా కొనసాగిన స్వామివారి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజుతోపాటు ఆదివారం కావడంతో పరిసర జిల్లాలతోపాటు సరిహద్దులోని కర్నాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. ఉదయం స్వామివారికి అభిషేకం, గణపతి, శతచండీ హోమం, హోమసమాప్తి, పుర్ణాహుతి, మంగళ హారతి, మహా నైవేద్యం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. యజ్ఞశాల శివ, వినాయక నామస్మరణతో మార్మోగింది. 325 మంది దంపతులు యజ్ఞాల్లో పాల్గొన్నారు.
హాజరైన మంత్రి గీతారెడ్డి...
సిద్ధివినాయక ఉత్సవాల చివరి రోజైన ఆదివారం కంచికామ కోటి పీఠం ధర్మాధికారి శ్రీజయశంకర్ బాలగోపాల్‌తోపాటు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. భర్త రామచంద్రారెడ్డితోపాటు అల్లుడు సుధీర్‌రెడ్డి హాజరయ్యా రు. మంత్రి గీతారెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు, ట్రస్టుసభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆల యంలో పూజలు నిర్వహించిన మంత్రి ఆ తరువాత యజ్ఞశాలను సందర్శిం చారు. ఈ ఉత్సవాల్లో డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు జగనాథ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ సిద్ధిలింగయ్యస్వామి, సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారెడ్డి, ట్రస్టు సభ్యులు రేజింతల్ సంగయ్య, రమేశ్ కుమార్‌పాండే, జ్ఞానేశ్వర్ సిందోల్, అల్లాడి నర్సింలు, ఉల్లిగడ్డబస్వరాజ్, నీల రాజేశ్వర్, చిద్రి లక్ష్మణ్, దిగంబర్, రేజింతల్ సర్పంచ్ రేణుక తదితరులు పాల్గొన్నారు.
సిద్ధి వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తజనం
Published Mon, Jan 6 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement