విశాఖపట్నం: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం నుంచి నాలుగురోజులపాటు కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కె.కె.పాఠక్, కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.పి.సింగ్, కేంద్ర రూరల్ వాటర్ అండ్ శానిటేషన్ కన్సల్టెంట్ బ్రిజేష్ శ్రీవాత్సవ, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ డివిజన్ డెరైక్టర్ రాజిబ్ కుమార్‌సేన్, రూరల్ డెవలెప్‌మెంట్ అండర్ సెక్రటరీ రామవర్మ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డెరైక్టర్ వివేక్ గోయల్, కృష్ణాగోదావరి బేసిన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం.రమేష్‌కుమార్‌లతో పాటు రాష్ర్ట వ్యవసాయశాఖ డీవోడీ డెరైక్టర్ ఎస్.ఎం.కోలాట్కర్ ఈబృందంలో సభ్యులుగా ఉన్నారు.
ఢిల్లీ నుంచి విమానంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖ చేరుకోనున్న ఈ బృందం సభ్యులు తొలుత ఎయిర్‌పోర్టులో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తుంది. తుపాను నష్టంపై కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. బుధవారం విశాఖపట్నం నగరంతో పాటు జిల్లాలోని అనంతగిరి, అచ్యుతాపురం, మునగపాక, అనకాపల్లి, కశింకోట మండలాల్లో పర్యటిస్తారు. గురువారం తూర్పు గోదావరి జిల్లాలోని తుని, యు.కొత్తపల్లి మండలాల్లో పర్యటించి విశాఖకు చేరుకుంటారు. విశాఖలో అధికారులతో సమీక్ష అనంతరం అదేరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.
నేటి నుంచి కేంద్రం బృందం పర్యటన
Published Tue, Nov 25 2014 7:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement