ఛలో అసెంబ్లీ...ముందస్తు అరెస్ట్‌లు | Chalo Assembly Police Arrested all party leaders in AP | Sakshi
Sakshi News home page

ఛలో అసెంబ్లీ...ముందస్తు అరెస్ట్‌లు

Published Mon, Nov 20 2017 9:36 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Chalo Assembly Police Arrested all party leaders in AP

సాక్షి, అమరావతి: అఖిలపక్షం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా  పోలీసులు ముందస్తు  అరెస్ట్‌లు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం ఇవాళ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణలో తిప్పుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశారు. శ్రీకాళహస్తిలో వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అమరావతిలో అసెంబ్లీతో పాటు, సచివాలయం వద్ద  పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐడీ కార్డులు చూపించిన తర్వాతే లోపలకి అనుమతిస్తున్నారు.

గుంటూరులో సీపీఐ నేతలను, అలాగే గతరాత్రి నుంచే సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌ను పాతగుంటూరు పీఎస్‌లోనే ఉంచారు. ఇక కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, గుడివాడలో పోలీసులు మందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. తిరుపతిలో సీపీఐ నేతలు, రంపచోడవరంలో సీపీఎం నేతలను అరెస్ట్‌ చేశారు. మరోవైపు ముందస్తు అరెస్ట్‌లపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్‌లు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement