శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : ‘ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలుండవ్.. వ్యక్తిగత ఆలోచనలు పెట్టుకోకండి.. నిబంధనల ప్రకారం పని చేయండి..’ అని కలెక్టర్ సౌరభ్ గౌర్ అధికారులు, ఉద్యోగులను హెచ్చరించారు. జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల అంశంపై బుధవారం జెడ్పీ సమావేశ మం దిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను గురువారానికల్లా ఖరారు చేయాలని, ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆదేశించారు.
రిజర్వేషన్ల ప్రక్రియ చాలా కీలకమని, ఎవరి ప్రలోభాలు ఉండకూడదన్నారు. అలాగే వ్యక్తిగత ఆలోచనలు పెట్టుకోకూడదని, అలా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రిజర్వేషన్ల ఖరారులో సీని యర్ అధికారుల సూచనలు తీసుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను తాను సిద్ధం చేశానని, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చే యాలని, ఈ రెండింటి వివరాలను గురువారం ప్రకటించాలన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చర్యలు చేపట్టాలని జెడ్పీ డిప్యూటీ సీఈవో శీర రమేష్, శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి ఆర్డీవోలు గణేష్‌కుమార్, తేజ్‌భరత్, శ్యామ్‌లను ఆదేశించారు.
అధికారులపై గరం గరం..
పలువురికి మెమోలు
ఎన్నికల సమావేశం నిర్వహిస్తున్నట్లు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ దాదాపు 8 మంది ఎంపీడీవోలు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. మరికొందరు ఆలస్యంగా వచ్చా రు. దీంతో కలెక్టర్ సౌరభ్ గౌర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘కీలకమైన ఎన్నికల సమావేశాలకు కూడా హాజరుకాకుండా ఏం చేస్తున్నారు మీరు? ఇలాగైతే ఉద్యోగాలుండవ్..’ అని హెచ్చరించారు. కోటబొమ్మాళి ఎంపీడీవో మాషా నుద్దేశించి మాట్లాడుతూ ‘ఇతను ఉన్న దే శ్రీకాకుళంలో.. అయినా రాలేదు’ అని మండిపడ్డారు. పావుగంట తర్వాత వ స్తున్న మాషాను చూసి, తక్షణం ఆయన్ను బయటకు పంపేయాలని ఆదేశించారు.
దీంతో మాషాను జెడ్పీ సిబ్బంది బయటకు పంపి తలుపులు వేసేశారు. సెలవులో ఉన్న ఎంపీడీవోల విషయమై మాట్లాడుతూ సెలవు కారణాలపై విచారించాలని, సమావేశానికి హాజరు కానివారందరికీ మెమోలు జారీ చేయాలని డిప్యూటీ సీఈవోను ఆదేశించారు. అలాగే జెడ్పీ సూపరింటెండెంట్లు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ‘జెడ్పీ లో ఉద్యోగులు అసలు పనిచెయ్యరు.. వెంటనే సమవేశానికి రమ్మనండి’ అని మండిపడ్డారు.
నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి
ఎచ్చెర్ల : ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ సూచిం చారు. బుధవారం స్థానిక సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రంలో జరిగిన జిల్లా సమాఖ్య సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా సమాఖ్యలో పనిచేస్తున్న సిబ్బంది గ్రామా ల్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు పార్టీ కార్యకలాపాలకు పాల్పడకుండా ఎన్నికల ప్రవర్తనా నియమాలను పాటించాలన్నారు.
ఒక వేల ఎవరైన అతిక్రమించినట్లైతే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. జిల్లాలో 40 చోట్ల చెక్‌పోస్టులను పెట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 9న ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎస్.తనూజారాణి మాట్లాడుతూ జిల్లా సమాఖ్యకు మండల సమాఖ్యలు అందిస్తున్న నివేదికలను సక్రమంగా లేవంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ నెల మాస నివేదికలను, కచ్చితమైన వివరాలతో పక్కాగా తయారుచేసి జిల్లా సమాఖ్యకు పం పించాల్సిన బాధ్యత ఆయా మండలాల ఏపీఎంలదేనని చెప్పారు. అలాగే మండల సమాఖ్యల పనితీరుకు సంబంధించి గ్రేడింగ్‌ల జాబి తాలను ఎంఎంఎస్ కార్యాలయాల్లో ఏర్పాచేయాలని సూచించారు. రూ.కేపీ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూ.బీ డీపీఎం వైకంఠరావు, ఇన్సూరెన్స్ డీపీఎం కె.నారాయణరావు, మల్లేశ్వరరావు, నారాయణరావు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలుండవ్
Published Thu, Mar 6 2014 1:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement