ఆసుపత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి | Chandrababu Naidu Discharged from asian institute of gastroenterology | Sakshi
Sakshi News home page

ఆసుపత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి

Published Thu, Oct 17 2013 1:19 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

ఆసుపత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి - Sakshi

ఆసుపత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి

సాక్షి, హైదరాబాద్: ఇక్కడి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీఈ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును బుధవారం డిశ్చార్జి చేశారు. గత ఆదివారం సాయంత్రం ఏఐజీఈలో చేరిన చంద్రబాబుకు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం మూడు రోజులపాటు చికిత్స అందించింది. ఆరోగ్యం మెరుగుపడటంతో చంద్రబాబును బుధవారం డిశ్చార్జి చేశారు. మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. డిశ్చార్జి అయిన వెంటనే చంద్రబాబును కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రహ్మణి దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement