మీడియాకు మొహం చాటేసిన చంద్రబాబు
కృష్ణా: గన్నవరం ఎయిర్పోర్టు వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకు మొహం చాటేశారు. మంగళవారం గన్నవరంలో నూతన టెర్మినల్ను చంద్రబాబు ప్రారంభించారు. ఎయిర్ పోర్టు టెర్మినల్ ప్రారంభం తర్వాత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తాను చెప్పింది పూర్తి అయ్యాక మీడియా సమావేశంలో రేవంత్ వ్యహారంపై చంద్రబాబు మాట్లాడలేదు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తుండగానే చంద్రబాబు అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ బెంజిసర్కిల్‌లో నవనిర్మాణ దీక్ష ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.