తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ . చంద్రబాబు నాయుడు పెంటావాలెంట్ వ్యాక్సినేషన్ను గురువారం తిరుపతిలో ప్రారంభించారు. ఈ వ్యాక్సినేషన్తో చిన్నారులకు ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందని తెలిపారు. శిశు మరణాలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమని ఆయన హెచ్చరించారు.
గర్భిణీలకు అంగన్ వాడీల ద్వారా పోషకాహారం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన నుంచి ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. అలాగే తెలంగాణలో 11, 12 తేదీల్లో ప్రారంభించనున్నారు. అందుకోసం ఉన్నతాధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా పెంటావాలెంట్ వ్యాక్సిన్ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నారు.