'వారిద్దరు తెలుగుతల్లిని చంపిన హంతకులు' | Chandrababu naidu, kiran kumar reddy is responsible for AP bifurcation, says roja | Sakshi
Sakshi News home page

'వారిద్దరు తెలుగుతల్లిని చంపిన హంతకులు'

Published Sat, Mar 1 2014 12:13 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'వారిద్దరు తెలుగుతల్లిని చంపిన హంతకులు' - Sakshi

'వారిద్దరు తెలుగుతల్లిని చంపిన హంతకులు'

తిరుపతి : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు తల్లిని దారుణంగా చంపిన హంతకులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి అని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు ముమ్మాటికీ కారణం వీరిద్దరేనని రోజా విమర్శించారు.

ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని ఆమె అన్నారు. చివరి బంతి అంటూ తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా కిరణ్ ద్రోహం చేశారని రోజా వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే జగన్ ఎక్కడికి వెళ్లినా జన నీరాజనం అందుకుంటున్నారని రోజా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement