కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా | Roja slams on kiran kumar reddy, chandrababu naidu | Sakshi
Sakshi News home page

కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా

Dec 11 2013 6:45 PM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా - Sakshi

కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు రాష్ట్ర విభజన ద్రోహులంటూ వైఎస్ఆర్ సీపీ నేత రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరుపతిలోని నగరిలో రోజా నేతృత్వంలో బుధవారం రైతుల ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు.

తిరుపతి: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు రాష్ట్ర విభజన ద్రోహులంటూ వైఎస్ఆర్ సీపీ నేత రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరుపతిలోని నగరిలో రోజా నేతృత్వంలో  బుధవారం రైతుల ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆమె  కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు.  కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు తెరవెనుక సమైక్యవాదాన్ని వినిపిస్తూ వీరిద్దరూ యూపీఎ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని రోజా మండిపడ్డారు.

అయితే సమైక్యం కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని రోజా చెప్పారు. జగన్ ఇప్పటికే చాలా పార్టీల మద్దతు కూడగట్టుకున్నారని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం జగన్ వల్లే సాధ్యమని రోజా స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement