చంద్రబాబుది ఏ వాదమో స్పష్టం చేయాలి: చెంగల | Chandrababu naidu should be clear that Telanganavadam or Samaikyavadam, says Ch. venkatarao | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది ఏ వాదమో స్పష్టం చేయాలి: చెంగల

Published Thu, Aug 29 2013 1:32 PM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM

Chandrababu naidu should be clear that Telanganavadam or Samaikyavadam, says Ch. venkatarao

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెంగల వెంకట్రావు నిప్పులు చెరిగారు. విశాఖపట్నం నగరంలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన నాయకత్వం వహించారు.  తెలంగాణ వాదో లేక సమైక్యవాదో వెంటనే చంద్రబాబు స్పష్టం చేయాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. 

 

అలా చేయకుంటే చంద్రబాబు త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రను ఖచ్చితంగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. గతంలో చెంగల వెంకట్రావు విశాఖపట్నంలోని పాయకరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం ఆయన చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement