
సంబరాలు చేసుకోదలచుకోలేదు: చంద్రబాబు
హైదరాబాద్: 100 రోజుల్లో కార్యాలయాలు లేకపోయినా అధికారులు లేకపోయినా బాగానే పనిచేశానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 100 రోజులు సంబరాలు చేసుకోదలచుకోలేదని చెప్పారు. ఏపీలో త్వరలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ సరఫరా నష్టాలను 9 శాతానికి తగ్గించి అందరికీ ఆదర్శంగా నిలుస్తామన్నారు.
హీరో కంపెనీ ద్వారా 3 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రూ.600 కోట్లతో డీఆర్‌డీవో ప్రాజెక్ట్‌ను చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించామని వెల్లడించారు. 100 రోజుల్లో రూపొందించిన ప్రణాళిక ద్వారా ఐదేళ్ల పాలన కొనసాగిస్తామన్నారు.