
'కేసీఆర్ ను సంప్రదిస్తే వివాదం ఉండేది కాదు'
విజయవాడ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: విజయవాడ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించేందుకు టీడీపీ ప్రయత్నం చేయాలని అన్నారు.
మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేరును చంద్రబాబు వివాదాల్లోకి లాగుతున్నారని వాపోయారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టే ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ను సంప్రదించివుంటే వివాదం వచ్చేదికాదన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.