
బాబు దీక్ష జాతీయ నేతలను ఆకర్షించేందుకే : గుత్తా
తెలుగు ప్రజల పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్ష జాతీయనేతల దృష్టిని ఆకర్షించేందుకేనని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
నల్లగొండ: తెలుగు ప్రజల పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్ష జాతీయనేతల దృష్టిని ఆకర్షించేందుకేనని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో కోల్పోయిన ప్రాభవాన్ని జాతీయ స్థాయిలో తిరిగి పొందేందుకు ఈ ప్రయత్నమని తెలిపారు. నల్లగొండలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయమంటూ చంద్రబాబు, వైఎస్.జగన్ చేసిన దీక్షలు ఎంత మాత్రం పరిష్కారం చూపవన్నారు. దేశవ్యాప్తంగా డిమాండ్ లేని దీక్ష అంటే ఒక్క చంద్రబాబు నాయుడు చేస్తున్నదేనన్నారు.
అసెంబ్లీకి వచ్చే ముసాయిదా బిల్లుపై అభిప్రాయం మాత్రమే ఉంటుందని, ఓటింగ్‌కు అవకాశం కూడా ఉండదన్న వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.