'చంద్రబాబుకు మతిస్థిమితం కోల్పోయినట్టుంది'
ఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మతిస్థిమితం కోల్పోయినట్లున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రుల ఉద్యమం సరైందేనని బాబు వ్యాఖ్యానించడంపై గుత్తా మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తప్పుబట్టారు. చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో సీమాంధ్రలో యాత్రను ఆరంభించారన్నారు.
తెలంగాణ అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు..ఇప్పుడు సీమాంధ్రలో యాత్ర ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు త్వరలోనే రెండు కళ్ల కోల్పోవడం ఖాయమని గుత్తా ఎద్దేవా చేశారు. తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర పేరుతో బాబు సీమాంధ్ర ప్రజలకు దగ్గరైందుకు యత్నిస్తున్నారన్నారు.