
2009లో చనిపోయింది వైఎస్ఆర్ కాదు, పోలవరం..
పట్టిసీమ ప్రాజెక్ట్ ఉభయ భ్రష్టు ప్రాజెక్ట్ అని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ..
రాజమండ్రి : పట్టిసీమ ప్రాజెక్ట్ ఉభయ భ్రష్టు ప్రాజెక్ట్ అని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పట్టిసీమను పూర్తి చేస్తే పోలవరం ప్రాజెక్ట్ను మార్చిపోవాల్సిందేనన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
2009లో చనిపోయింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదని, పోలవరం ప్రాజెక్ట్ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్కు అనుమతులు అన్ని వైఎస్ఆర్ హయాంలోనే వచ్చాయన్నారు. రాష్ట్రానికి లైఫ్లైన్ పోలవరం ప్రాజెక్ట్గా ఉండవల్లి పేర్కొన్నారు. చంద్రబాబు తన పేరు పోగొట్టుకోకూడదంటే పట్టిసీనమను తక్షణమే నిలిపివేసి ఆ నిధులతో పోలవరంను పూర్తి చేయాలని ఆయన సూచించారు.