పాస్‌పోర్ట్ తేదీల్లో మార్పు | changes for passport application submission | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్ తేదీల్లో మార్పు

Published Tue, Jan 13 2015 9:40 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

పాస్‌పోర్ట్ తేదీల్లో మార్పు - Sakshi

పాస్‌పోర్ట్ తేదీల్లో మార్పు

విశాఖపట్నం: పాస్‌పోర్ట్ దరఖాస్తు సమర్పించడానికి నిర్దేశించిన తేదీలలో మార్పులు చేసినట్టు పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలియజేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినంలో మార్పు జరగడంతో పాస్‌పోర్ట్ సేవలు ముందుగా అందచేస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఈ ఏడాది సంక్రాంతి జనవరి 15న జరుపుకుంటున్న నేపథ్యంలో 14న కార్యాలయంలో సేవలు అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ఈనెల 15న స్లాట్ బుకింగ్ పొందిన అభ్యర్థులు అందుకు బదులుగా 14వ తేదీన సేవలు పొందాలని స్పష్టం చేశారు. పాస్‌పోర్ట్ వినియోగదారులు మార్పు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement