=రెండు వారాల క్రితం ఇద్దరు పోలీసుల హతం
=ఇప్పటికీ పట్టుబడని హంతకులు
=నాలుగు రోజుల క్రితం ఇద్దరు అటవీశాఖాధికారుల హత్య
=మితిమీరిన రాజకీయ జోక్యంతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి జిల్లాలో రక్షణాధికారులకే రక్షణ లేకుండాపోయింది. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన వారి ప్రాణాలే గాలిలో కలసిపోతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో అడుగడుగునా రాజకీయ జోక్యం పెరిగిపోయి పాలనా వ్యవ స్థ నిర్వీర్యం కావడమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకపక్క హంతకులు, మరోపక్క స్మగ్లర్లు రెచ్చిపోయి ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నా ఇటు నుంచి సరైన స్పందన కానరావడం లేదు.
ఒకప్పుడు ప్రశాంతమైన జిల్లాగా పేరొందిన చిత్తూరు పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఈ నెల ఒకటవ తేదీ రాత్రి పలమనేరు సమీపంలోని గాంధీనగర్ అటవీ ప్రాంతంలో కానిస్టేబుల్, హోంగార్డు దారుణ హ త్యకు గురయ్యారు. యువతిని తీసుకుని కొందరు ఆటో లో అనుమానాస్పదంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వారిని పట్టుకునేందుకు వెంబడించిన కానిస్టేబుల్ జవ హర్‌లాల్ నాయక్, హోంగార్డు దేవేంద్రకుమార్‌ను కత్తులతో పొడిచి, రాళ్లతో కొట్టి చంపేశారు. చంపిందెవరు? ఎందుకు ? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ దర్యాప్తు అధికారుల వద్ద సమాచారం లేదు. పోలీసులే చిత్తూరు జిల్లాలో హత్యకు గురయ్యారన్న వార్త సంచలనం సృష్టించింది.
గుర్తుతెలియని దుండగుల చేతిలో హతం కావడం పోలీసు ప్రతిష్టకే సవాల్‌గా మారింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి వారం రోజుల్లో నిందితులను పట్టుకుం టామంటూ చేసిన ప్రకటనలు నేటికీ ఆచరణరూరం దాల్చలేదు. రాత్రి పూట అటవీ ప్రాంతంలోకి ఒక కానిస్టేబుల్, హోంగార్డు ఎందుకు వెళ్లారు? ఏ అధికారి వీరిని పంపించారు? రాత్రంతా వీరి జాడ తెలియకపోతే ఎం దుకు సంబంధిత ఎస్‌ఐ, సీఐ, డీఎస్‌పీలు స్పందించలేదన్న ప్రశ్నలకు జవాబులే లేవు.
ఇక ఇటీవల తిరుమల శేషాచల అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకొనేందుకు వెళ్లిన అటవీశాఖాధికారులు శ్రీధర్, డేవిడ్‌లు చిత్రహింసలకు గురై మరణించారు. అటవీశాఖాధికారులను చూడగానే పారిపోయే స్మగ్లర్లు ఎదురుదాడికి ఎందుకు దిగారు? ఏకంగా హత్యలకే ఎందుకు తెగబడ్డారు? అంటే స్మగ్లర్లకు అధికార పార్టీ నేతల నుంచి అందుతున్న అండదండలే కారణమని సాటి అటవీశాఖ అధికారులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కురిపిస్తున్న కోట్ల రూపాయలకు కక్కుర్తిపడ్డ కొందరు ప్రభుత్వ పెద్దలు, వారి అనుయాయులు స్మగ్లర్లకు అండగా ఉన్న కారణంగానే అధికారులపై దాడులు జరిగాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అటవీశాఖాధికారుల హత్యల తరువాత ఆ శాఖాధికారు లు, పోలీసులు స్మగ్లర్ల అంతుచూసేందుకు రంగంలోకి దిగి కొందరిని అరెస్టు చేశారు. అయితే, కొందరు పాలకపక్ష పెద్దలు ఈ హత్యల పట్ల ఏమాత్రం విచారం వ్యక్తం చేయకపోగా, అరెస్టయిన స్మగ్లర్లకు బెయిల్ ఇప్పించేందు కు డబ్బు సమకూర్చారనే కథనాలు వినిపిస్తున్నాయి. ము ఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గమే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డాగా మారింద ని, ఆయన తరపున జిల్లాలో పనులు చక్కబెడుతున్న ఆయన సోదరుడే స్మగ్లింగ్‌కు సూత్రధారి అని కాంగ్రెసేతర పక్షాలన్నీ ఆరోపిస్తున్నా నిష్పక్షపాతంగా విచారణ జరిపే వాతావరణమే కనిపించడం లేదు.
పీలేరు నుంచి ఎర్రచందనం చెట్లను నరికేందుకు వందల సంఖ్యలో వెళ్లిన కూలీ లను పిలిచి విచారించే సాహసమే అధికారులు చేయడం లేదు. ప్రభుత్వ ఈ నిర్లిప్త వైఖరే దుండగులు, స్మగ్లర్లకు అండగా మారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సీఎం జిల్లాలో ‘రక్షణ’ కరువు
Published Thu, Dec 19 2013 6:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement