కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు రంగం సిద్ధమయింది. అధికార యంత్రాంగం మొత్తం ఎమ్మిగనూరు, కోటేకల్‌లో తిష్టవేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మిగనూరు మండలం కోటేకల్ చేరుకోనున్న ముఖ్యమంత్రి.. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఎమ్మిగనూరులోనే ఉంటారు.
హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు కోటేకల్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో దిగుతారు
3.10 నుంచి 3.25 గంటల వరకు కోటేకల్‌లోని వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.
3.30 నుంచి 3.45 వరకు రైతులతో ముఖాముఖి.
3.45 నుంచి 3.55 వరకు నీరు-చెట్టుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలన.
3.55 నుంచి 5.30 వరకు కోటేకల్‌లో నీరు-చెట్టుపై అవగాహన సదస్సు.
5.40 నుంచి 6 గంటల వరకు బనవాసిలోని టెక్స్‌టైల్స్ పార్కు భూములను పరిశీలన. అక్కడే చేనేతకారులతో ముఖాముఖి.
6.15 గంటలకు రోడ్డు మార్గంలో ఎమ్మిగనూరులోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ చేరుకుంటారు.
6.15 నుంచి 7 గంటల వరకు అధికారులు, అనధికారులతో సమావేశం.
7.15 నుంచి 8.30 గంటల వరకు ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెజెండ్ సినిమా 400 రోజుల విజయోత్సవ సభలో పాల్గొంటారు. రాత్రికి ఎమ్మిగనూరులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో బస.
3వ తేదీ ఉదయం 8 గంటలకు స్పిన్నింగ్ మిల్ మైదానంలోని హెలిపాడ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.
నేడు జిల్లాకు సీఎం రాక
Published Sat, May 2 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement
Advertisement