ఏలూరులో ఈనెల 8న జరగాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన రద్దయ్యింది.
ఏలూరు : ఏలూరులో ఈనెల 8న జరగాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన రద్దయ్యింది. మహా సంకల్పం పేరిట ఏలూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని గురువారం తణుకు మండలం వేల్పూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విష యం విదితమే. ఆ కార్యక్రమం గుంటూరుకు మారడంతో ఏలూరులో బహిరంగ సభ ఉండదని అధికార వర్గాలు వెల్లడిం చాయి. వేల్పూరులో సీఎం చేసిన ప్రకటనతో నాలుగు రోజుల వ్యవధిలోనే ఏర్పాట్లు ఎలా చేయాలోనని యంత్రాం గం కంగారుపడింది. ఈనెల 8న సీఎం రావడం లేదని తెలిసి ఊపిరి పీల్చుకుంది. 10 రోజుల అనంతరం ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు.