
సీతంపేట(విశాఖ ఉత్తర): బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చొక్కాకుల వెంకటరావు వైఎస్సార్ సీపీ పార్టీలో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన చొక్కాకుల అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. చొక్కాకుల వెంటకరావు శనివారం సీతమ్మధారలో గల ఆయన ఇంట్లో ఉత్తర నియోజకవర్గం ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. నాయకుల అభిప్రాయం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు.
దీంతో బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్య వర్గ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేసి ఆ పార్టీ అధిష్టానికి లేఖలు పంపించారు. అతనితో పాటు 37వ వార్డు బీజేపీ అధ్యక్షుడు కోరిబిల్లి విజయకుమార్, నగర కార్యవర్గ సభ్యులు గుడ్ల భాస్కరరెడ్డి, చొక్కాకుల రామకృష్ణ, జాగారపు శ్రీనివాసరావు, గుళ్లిపల్లి చంద్రమౌళి, 13వ వార్డు యువమోర్చా అధ్యక్షుడు సారిపిల్లి సంతోష్, సీనియర్ నాయకులు మీసాల అప్పారావు, కొటకల కుమార్, బగాది విజయకుమార్ బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరంతా చొక్కాకుల వెంకటరావుతో కలిసి వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహనరెడ్డి సమక్షంలో సోమవారం పార్టీలో చేరాలని నిర్ణయించారు. నాలుగేళ్ల తర్వాత చొక్కాకుల సొంత గూటికి చేరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment