కొత్తకోట, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో వోల్వో బస్సు దగ్ధమై 45 మంది సజీవ దహనమైన ఘటనపై సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. డీఐజీ రవిచంద్ర నేతృత్వంలో అధికారులతో పాటు వోల్వో కంపెనీ నిపుణులు సోమవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మరో వోల్వో బస్సును ప్రమాద స్థలానికి తెప్పించారు. ఆ బస్సు సహాయంతో ప్రమాదం జరిగిన తీరుపై రిహార్సల్స్ నిర్వహించి పరిశీలించారు.
ప్రమాదానికి గురైన బస్సు మొదట డివైడర్ ఎక్కి అదుపు తప్పిందని, ఆ తర్వాత కల్వర్టును ఢీకొందని నిర్ధారణకు వచ్చారు. దాంతో కల్వర్టుపై ఉన్న ఇనుపరాడ్డు తగిలి డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఆ కల్వర్టు నిర్మాణంలోని లోపాలను కూడా గుర్తిం చారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని.. కల్వర్టు నిర్మాణంలోని లోపాలు ప్రమాదం తీవ్రత పెరగడానికి కారణమై ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. పాలెం బస్సు ప్రమాద కారణాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చామని.. జాతీయ రహదారి నిర్మాణ లోపాలతో పాటు, వోల్వో బస్సు తయారీలో లోపాలను గుర్తించామని సీబీసీఐడీ డీఐజీ రవిచంద్ర అనంతరం మీడియాకు తెలిపారు.
బస్సు దగ్ధం ఘటనపై సీఐడీ విచారణ
Published Tue, Nov 19 2013 4:32 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement