సాక్షి, హైదరాబాద్: మాట్రిమోనియల్ సైట్స్‌లో మారు పేర్లతో రిజిస్టర్ చేయించుకుని, యువతులకు వలవేసి మోసగిస్తున్న ఘరానా నిందితుడిని సీఐడీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఇప్పటి వరకు అనేక మంది యువతులను మోసం చేసి వారి నుంచి భారీగా సొత్తు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ వివిధ మాట్రిమోనియల్ సైట్లలో మారుపేర్లు, బోగస్ వివరాలతో రిజిస్టర్ చేసుకున్నాడు. తనను సంప్రదించిన యువతులతో పరిచయం పెంచుకుని పెళ్లి పేరుతో వారిని నమ్మించి వారి వద్ద ఉన్న బంగారు నగలను కాజేసేవాడు. ఇప్పటి వరకు 60 తులాల బంగారం కాజేసినట్టు సమాచారం.