విశాఖపట్నం: మూడు రోజుల పాటు జరిగే భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 22వ భాగస్వామ్య సదస్సు ఆదివారం ప్రారంభమైంది. 'సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఏపీ ఇన్వెస్టర్స్ మీట్' విశాఖలోని హార్బర్ పార్కు సమీపంలోని ఏపీఐఐసీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, పీయూష్ గోయల్ తదితర ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. సీఐఐ సదస్సు నేపథ్యంలో 2 వేల మంది పోలీసులతో విశాఖపట్నంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.
విశాఖలో భాగస్వామ్య సదస్సు ప్రారంభం
Published Sun, Jan 10 2016 3:54 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement