అరకు రూరల్/అనంతగిరి రూరల్, న్యూస్‌లైన్: అరకు, అనంతగిరి మండలాల్లోని పర్యాటక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఈ ప్రాంతానికి వచ్చారు.
కుటుంబ సభ్యులతో అనంతగిరి మండలంలోని హిల్‌రెస్టారెంట్‌లో శనివారం రాత్రి బస చేసి, ఆదివారం సందర్శిత ప్రాంతాల్లో విహ రించారు. ఉదయాన్నే పద్మాపురం ఉద్యానవన కేంద్రాన్ని తిలకించా రు. టాయ్ ట్రైయిన్‌లో గార్డెన్ అంతా కలియ తిరిగారు. పూలతోటలను వీక్షించి ఆనందంతో పరవశించిపోయారు. గిరిజన సాంస్కృతిక మ్యూజియంను తిలకించి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
మ్యూజియంలోని కళాకృతులను చూసిన ఆయన గిరిజన సంప్రదాయ,ఆచార వ్యవహారాలు, ప్రాచీన సంస్కృతిపై ఆరా తీశారు. కలెక్టర్ బంగ్లాలో అల్పహారం అనంతరం అనంతగిరి మండలంలోని బొర్రాగుహలను సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి కాఫీ తోటల్లో విహరించారు. ఆయన వెంట బొర్రాగుహాలు,ఏపీటూరిజమ్ మేనేజర్లు గౌరీశంకర్, గాసి, కార్యదర్శి సోమేష్ ఉన్నారు.
కలెక్టర్ మది దోచిన మన్యం సొగసులు
Published Mon, Sep 30 2013 2:25 AM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM
Advertisement
Advertisement