కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకు కేటాయింపు ? | Collector siddharthjain allocation of Telangana? | Sakshi
Sakshi News home page

కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకు కేటాయింపు ?

Published Tue, Aug 19 2014 1:46 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకు కేటాయింపు ? - Sakshi

కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకు కేటాయింపు ?

చిత్తూరు (సెంట్రల్): జిల్లా కలెక్టర్‌గా నెల రోజుల క్రితం విధుల్లో చేరిన సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినట్లు నగరంలో వార్త హల్‌చల్ చేసింది. కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్‌లను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు కేటాయించే విషయూనికి సంబంధించి మొదటి ప్రాధాన్యతను లాటరీ పద్ధతిలో తెలంగాణకు కేటాయించింది.

ఈ క్రమంలో సీనియారిటీ లిస్టు ప్రకారం చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలంగాణ రాష్ట్రానికి వెళ తారని ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఆయన కుప్పం నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లారని, సీఎం చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తారని విశ్వసనీయ సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement