
కాంగ్రెస్ విజృంభణ
ఏపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి విజృంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
హైదరాబాద్: ఏపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి విజృంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందిరాభవన్‌లో ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అనంతరం పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి శైలజానాధ్, ఎమ్మెల్సీ పద్మరాజు మాట్లాడుతూ రుణమాఫీపై టిడిపి సర్కార్ విఫలమవుతున్న తీరును ఎండగడతామని చెప్పారు.
రుణమాఫీపై వచ్చేనెల మొదటివారంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బంగారు నగలను వేలం వేయడానికి బ్యాంకులు నోటీసులిస్తున్నాయని తెలిపారు. బ్యాంకుల్లోని బంగారు నగలు వేలం వేస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
**