రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వరంగల్ : రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్ చేశారు.
రాయల తెలంగాణ కావాలని ఏ రాజకీయ పార్టీ కోరలేదని ఎర్రబెల్లి అన్నారు. వేరే జిల్లాలను కలుపుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు టీడీపీ వ్యతిరేకమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. త్వరలో ఢిల్లీ వెళతామని, తమ వాదనను వినిపిస్తామని ఆయన తెలిపారు.