'కాంగ్రెస్ గేమ్ప్లాన్లో ఏమీ చేయలేకపోయాం' | Congress implement Game Plan on telangana bills, says chandrababu naidu | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ గేమ్ప్లాన్లో ఏమీ చేయలేకపోయాం'

Published Wed, Feb 19 2014 1:40 PM | Last Updated on Wed, Sep 19 2018 6:29 PM

'కాంగ్రెస్ గేమ్ప్లాన్లో ఏమీ చేయలేకపోయాం' - Sakshi

'కాంగ్రెస్ గేమ్ప్లాన్లో ఏమీ చేయలేకపోయాం'

హైదరాబాద్: విభజన విషయంలో విపరీతమైన డ్రామాలు ఆడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెస్ గేమ్ప్లాన్లో ఏమీ చేయలేకపోయామని అన్నారు. రెండు ప్రాంతాలకు కేంద్రం ఎందుకు న్యాయం చేయదని ప్రశ్నించారు. ఏమీ చేయని సీఎం కిరణ్ ఈ రోజు రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. రాజీనామా చేసే సమయంలోనూ సోనియాను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. టెన్ జనపథ్ రాసిన స్క్రిప్ట్ను ఇక్కడ అమలు చేస్తున్నారని ఆరోపించారు.

ఏ రూల్ ప్రకారం హైదరాబాద్ శాంతి భద్రతలు గవర్నర్కు అప్పగించారని చంద్రబాబు ప్రశ్నించారు. లోక్సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.అన్ని తెలిసి కూడా విచారణ పేరుతో స్పీకర్ ఎందుకు డ్రామాలాడుతున్నారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement