సాక్షి, హైదరాబాద్: త్వరలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేరువేరుగా రెండు పీసీసీలను ఏర్పాటు చేసే పనిలో కాంగ్రెస్ అధిష్టానం నిమగ్నమైంది. ఎన్నికల షెడ్యూల్ నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడకపోతే సమైక్య రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ప్రస్తుత పీసీసీకి తెలంగాణ ప్రాంతంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడం కష్టమవుతుందని, ఆ నాయకత్వాన్ని తెలంగాణ నేతలు ఆమోదించే పరిస్థితి ఉండదని అధిష్టానం అభిప్రాయ పడుతోంది. అందుకే రెండు పీసీసీల యోచన చేస్తోంది.