general elections schedule
-
Lok sabha elections 2024: సార్వత్రిక సమరం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్సింగ్ సంధుతో కలిసి శనివారం ఢిల్లీలో ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా మే 13 న నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలన్నింటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. షెడ్యూల్ విడుదలవడంతోనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచి్చనట్టు సీఈసీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని సీఈసీ ప్రకటించారు. షెడ్యూల్ నుంచి ఫలితాల వెల్లడి దాకా చూసుకుంటే ఈసారి ఎన్నికల ప్రక్రియ ఏకంగా 82 రోజుల సాగనుండటం విశేషం! 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల 119 రోజుల పాటు జరిగాయి. తర్వాత అత్యంత సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ ఇదే కానుంది. తమిళనాడుతో పాటు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి విడతలోనే పోలింగ్ పూర్తవుతోంది. మొత్తమ్మీద 23 రాష్ట్రాలు, యూటీల్లో ఒకే విడతలో; యూపీ, పశి్చమబెంగాల్, బిహార్లలో మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘సుపరిపాలన, అన్ని రంగాలకూ అందించిన అభివృద్ధి ఫలాల ప్రాతిపదికన అధికార పక్షం ఎన్నికల బరిలో దిగుతుండటం గత పదేళ్ల బీజేపీ పాలనలో భారత్ సాధించిన అద్భుత మార్పు’’ అని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం బారినుంచి కాపాడేందుకు ఈ ఎన్నికలు బహుశా చివరి అవకాశమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రపంచానికే తలమానికంగా... ప్రపంచానికే ప్రామాణికంగా నిలిచిపోయేలా ఈసారి ఎన్నికలను నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో 91.2 కోట్ల మంది ఓటర్లుండగా 61.5 కోట్ల మంది, అంటే 67.4 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓటింగ్ శాతాన్ని ఇతోధికంగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఈసీ వివరించారు. అందుకోసం వయోవృద్ధ, వికలాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు సదుపాయం వంటి పలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలని కోరారు. రీ పోలింగ్ తదితరాలకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. 2022–23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీగా నగదు జప్తు చేసినట్లు వెల్లడించారు. అత్యధికంగా గుజరాత్లో రూ.802 కోట్లు, తెలంగాణలో రూ.778 కోట్లు, రాజస్థాన్‌లో రూ.704 కోట్లు జప్తు చేశారు. ఈసీ ఇంకేం చెప్పారంటే... ► జాతుల హింస బారిన పడ్డ మణిపూర్‌లో శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు అక్కడే ఓటేసేలా చర్యలు తీసుకున్నాం. ► సూర్యాస్తమయం తర్వాత బ్యాంకు వాహనాల రాకపోకలు నిషిద్ధం. ► నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలపై పూర్తిస్థాయి నిఘా, తనిఖీ ఉంటాయి. ► అక్రమ ఆన్లైన్ నగదు బదిలీలపై ఆద్యంతం డేగ కన్నుంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీవీప్యాట్ యంత్రాలు వినియోగిస్తారు. ► ప్రచారంలో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ నియోగించరాదు. ఆ లోక్‌సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్! ఈసీ విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్లో ఒక విశేషం చోటుచేసుకుంది. మొత్తం లోక్‌సభ స్థానాలు 543 కాగా 544 స్థానాలకు పోలింగ్ జరగనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు సీఈసీ వివరణ ఇచ్చారు. ‘‘మణిపూర్‌లో జాతుల హింసతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ఔటర్ మణిపూర్ లోక్‌సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. అందుకే మొత్తం స్థానాలు 543 అయినా 544గా కనిపిస్తున్నాయి’’ అని వివరించారు. ఔటర్ మణిపూర్‌లోని 15 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఏప్రిల్ 19న తొలి దశలో, మిగతా 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో 26న పోలింగ్ జరగనుంది. ‘4ఎం’ సవాలుకు సిద్ధం ‘‘స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఈసీ ముందు ప్రధానంగా నాలుగు రకాల సవాళ్లున్నాయి. అవే మజిల్ (కండ బలం), మనీ (ధన బలం), మిస్ ఇన్ఫర్మేషన్ (తప్పుడు సమాచారం), మోడల్ కోడ్ వయోలేషన్స్ (కోడ్ ఉల్లంఘన). వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు ఈసీ సర్వసన్నద్ధంగా ఉంది’’ అని సీఈసీ ప్రకటించారు. గత ఎన్నికల అనుభవాల ఆధారంగా ఈ దిశగా పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ‘‘1.5 కోట్ల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియోగిస్తున్నాం. జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల వద్ద డ్రోన్ ఆధారిత తనిఖీలు, నాన్ చార్టర్డ్ విమానాలపై పూర్తిస్థాయి నిఘా ఉంటాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు వార్తలు, ఎన్నికల హింసపై ఉక్కుపాదం మోపుతాం. కండబలానికి చెక్ పెట్టి, అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు వీలుగా కలెక్టర్లు, ఎస్పీలు అనుసరించాల్సిన పలు నియమ నిబంధనలను ఇప్పటికే జారీ చేశాం. ప్రతి జిల్లాలోనూ సమీకృత కంట్రోల్ రూములు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంటాయి’’ అని పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనను, ఎన్నికల హింసను సహించబోమన్నారు. వాటికి పాల్పడితే ఎంత పెద్ద నేతనైనా ఉపేక్షించేది లేదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘గతంలో గట్టిగా మందలించడంతో సరిపెట్టేవాళ్లం. ఇప్పుడు మాత్రం కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19 న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13, మే 20, 25న, జూన్ 1ల్లో నాలుగు విడతల్లో పోలింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తెలంగాణలో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో మే 13న ఉప ఎన్నిక జరుగనుంది. హోరాహోరీ తలపడండి, కానీ... ఎన్నికల బరిలో పార్టీలు హోరాహోరీగా తలపడవచ్చని, అయితే ఆ క్రమంలో గీత దాటకుండా చూసుకోవాలని సీఈసీ సూచించారు. విద్వేష ప్రసంగాలకు, కుల, మతపరమైన విమర్శలు, ప్రకటనలకు, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. నేతలు కూడా వ్యక్తిగత దాడికి, దిగజారుడు భాషకు నేతలు ఉండాలన్నారు. ఈ డిజిటల్ యుగంలో మాట్లాడే ప్రతి మాటా కనీసం వందేళ్ల పాటు రికార్డై ఉండిపోతుందని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘కావాల్సినంత ద్వేషించుకుందాం. కానీ తర్వాతెప్పుడైనా మిత్రులం కావాల్సొస్తే సిగ్గుపడే పరిస్థితి రాకుండా చూసుకుందాం’’ అన్న ప్రసిద్ధ ఉర్దూ కవితా పంక్తిని ఈ సందర్భంగా సీఈసీ చదివి విని్పంచారు! ‘‘ప్రకటనలను వార్తలుగా చిత్రించడం, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రత్యర్థులను అవమానించడం, వేధించడం వంటివి కూడదు. స్టార్ ప్రచారకులు ఎన్నికల ప్రచారంలో హుందాతనాన్ని కాపాడాలి’’ అన్నారు. తప్పుడు వార్తల సృష్టికర్తలపై కఠిన చర్యలు తప్పవన్నారు. విరాళాలపై నిఘా పారీ్టలకు అందే విరాళాలపై నిఘాకు యంత్రాంగం ఉండాలని సీఈసీ అన్నారు. ‘‘అదేసమయంలో దాతల గోప్యతను కాపాడాలి. వారిని వేధించకూడదు. పారీ్టలకు అనధికార మార్గాల గుండా అందే లెక్కలోకి రాని నిధులకు అడ్డుకట్ట వేసే ఉత్తమ వ్యవస్థ రావాలి. చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అన్ని విషయాలూ తెలియాలి’’ అన్నారు. -
Elections 2024: ముందస్తు ఎంపిక వెనుక
ఇంకా ఎన్నికల వేడి రాజుకోలేదు.. నోటిఫికేషన్ నగారా మోగలేదు అయినా బీజేపీ అయిదు రాష్ట్రాల ఎన్నికల కసరత్తు ముందుగానే ప్రారంభించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల తొలి విడత అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కమలనాథులకు ఎందుకీ తొందర? అభ్యర్థుల ఎంపిక వెనుక వ్యూహమేంటి? భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. మధ్యప్రదేశ్‌లో 39 మందితో, ఛత్తీస్‌గఢ్‌లో 21 మందితో తొలిజాబితా విడుదల చేసి ప్రత్యర్థి పార్టీల్లో ఎన్నికల వేడి పెంచింది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ) రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వెనుక దాగి ఉన్న వ్యూహంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్ నియోజకవర్గం నుంచి ఆయన సమీప బంధువు, బీజేపీ ఎంపీ విజయ్ భగేల్‌ను రంగంలోకి దింపి ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందనే సంకేతాలు పంపింది. గతంలో ఒకసారి భూపేష్ భగేల్‌ను ఓడించిన ఘనత విజయ్‌కు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా తదితరులు హాజరైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలోనే ముందస్తుగా అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. సీట్లలో ఏబీసీడీ వర్గీకరణ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందు అసెంబ్లీ స్థానాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు – ఏ కేటగిరీ మిశ్రమ ఫలితాలు వచి్చన స్థానాలు – బీ కేటగిరీ బలహీనంగా ఉన్న స్థానాలు – సీ కేటగిరీ ఇప్పటివరకు గెలవని స్థానాలు – డీ కేటగిరీ సీ, డీ కేటగిరీ సీట్లపై దృష్టి సారించిన కమలనాథులు ఆయా సీట్లకే తొలి జాబితా విడుదల చేశారు. ఆదివాసీ ప్రాంతాలే గురి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటివరకు బీజేపీ పాగా వెయ్యలేకపోయింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్‌కే పట్టు ఉంది. వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే ముందస్తుగా కసరత్తు పూర్తి చేసి బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించిన 21 స్థానాల్లో 10 ఎస్టీలకు రిజర్వ్ చేయబడినవే. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 13 స్థానాలు ఎస్టీ రిజర్వ్ సీట్లు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేయడానికి వీలుగా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చేదు ఫలితాల్నే మిగిల్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ఇక మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు గాను 109 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 114 సీట్లతో మెజారీ్టకి ఒక్క సీటు దూరంలో మిగిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2020లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదనే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముందస్తుగా మొదలు పెట్టింది. అంతర్గత సర్వేలు ఏం చెబుతున్నాయి ? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అంతర్గత సర్వేలు కాస్త ఆందోళన పుట్టించేలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 40% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వెల్లడైంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు గాను 30 నుంచి 32 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీ ఇక ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అత్యంత కీలకమైన హిందీబెల్ట్‌లో ఒక్క రాష్ట్రంలో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన పార్టీ అగ్రనాయకుల్లో ఉంది. ముందస్తు జాబితాతో మేలే బీజేపీ అగ్రనాయకులు ఎంతో కసరత్తు చేసి తాము బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారు. ‘‘ఈసారి ఎన్నికల్లో కొత్త వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వ్యూహంలో భాగమే. అభ్యర్థులు నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించి ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.’’అని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే ఇలా ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల రెబెల్స్ బెడద కూడా ఉంటుంది. ఆ రిస్క్ తీసుకొని మరీ కమలనాథులు ముందడుగు వేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అధికార మార్పు తప్పదు: బీజేపీ జోస్యం
హ్యాట్రిక్‌పై కాంగ్రెస్ ధీమా సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో కేంద్రంలో అధికారాన్ని మార్చేందుకు ప్రజలకు సమయం వచ్చిందని బీజేపీ పేర్కొంది. ఎన్నికల ప్రకటన నేపథ్యంలో... ఢిల్లీలో బుధవారం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అధికార ప్రతినిధులు సుధాంశు త్రివేది, ముక్తార్ అబ్బాస్ నక్వీ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు బీజేపీ ముందునుంచే సిద్ధంగా ఉందని చెప్పారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ లభిస్తోందని, తాము పూర్తి మెజారిటీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పరువు కాపాడుకోవడానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు, రాష్ట్రాల్లో ఉనికి కాపాడుకోవడానికి మూడో ఫ్రంట్ పార్టీలు, స్థాయిని నిలుపుకోవడానికి మరి కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని... కేవలం బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటుకు మైదానంలో ఉందని సుధాంశు త్రివేది అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కాంగ్రెస్ అవినీతి, ఆర్డినెన్సు కంపెనీకి తాళం పడిందని... కాంగ్రెస్ అవినీతి, ధరల పెరుగుదల, దుష్టపాలనకు ప్రజలు గుణపాఠం చెబుతారని నక్వీ అన్నారు. ఎన్నికల్లో సరైన ఎంపిక చేసుకోవాలని ప్రజలకు నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను గెలిపించాలంటూ ట్విట్టర్లో సందేశాలు పెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు దారుణ పరాజయం తప్పదని ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు. మూడోసారీ అధికారం మాదే: కాంగ్రెస్ దేశంలో మూడోసారీ అధికారం తమదేనని, కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే ప్రజలందరూ సమానత్వాన్ని పొందుతారని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. 2004, 2009 ఎన్నికల్లోనూ బీజేపీకి అనుకూలంగా సర్వేలు వచ్చాయని, ఈ సారీ బీజేపీకి అనుకూలంగా సర్వేలు వచ్చాయని.. కానీ, కాంగ్రెస్సే విజయం సాధిస్తుందని చెప్పారు. మీడియాలో ప్రచారం చేసుకొని తాము గెలుస్తామని బీజేపీ భావిస్తోందని దిగ్విజయ్‌సింగ్ ఎద్దేవా చేశారు. అనవసర వ్యయం పెరుగుతోంది: ఏచూరి తొమ్మిది విడతల్లో సుదీర్ఘంగా సాగే ఎన్నికల ప్రక్రియ వల్ల దేశంలో అనవసర వ్యయం పెరిగిపోతుందని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ప్రజలకు, పార్టీలకు ఇబ్బందికరమన్నారు. -
రాష్ట్రంలో రెండు విడతల్లో పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 42 పార్లమెంట్ స్థానాలు, 294 అసెంబ్లీ సీట్లకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశలో ఏప్రిల్ 30న తెలంగాణ జిల్లాల్లోని 17 పార్లమెంట్ స్థానాలకు, వాటి పరిధిలోని 119 అసెంబ్లీ స్థానాలకు; రెండో దశలో మే 7వ తేదీన సీమాంధ్ర జిల్లాల్లోని 25 పార్లమెంట్ స్థానాలకు, వాటి పరిధిలో గల 175 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) భన్వర్‌లాల్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. * ఏప్రిల్ 30న పోలింగ్ జరిగే స్థానాలకు ఏప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ. అప్పటి నుంచి ఏప్రిల్ 9 వరకు నామినేషన్లు స్వీకరణ. 10న నామినేషన్ల పరిశీలన, 12తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. * తొలి దశలో ఏప్రిల్ 30న పోలింగ్ జరిగే 17 పార్లమెంట్ స్థానాల పేర్లు: ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం (ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా అదే రోజు పోలింగ్ జరుగుతుంది). * రెండో దశలో మే 7న పోలింగ్ జరిగే 25 పార్లమెంట్ స్థానాల పేర్లు: కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందుపూర్, కడప, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు, అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి (ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా అదే రోజు ఎన్నికలు జరుగుతాయి). * మే 7న పోలింగ్ జరిగే స్థానాలకు ఏప్రిల్ 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అప్పటి నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 23తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. * రాష్ట్రంలో మొత్తం 6.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో తెలంగాణ జిల్లాల్లో 2.70 కోట్ల మంది ఉండగా, సీమాంధ్ర జిల్లాల్లో 3.54 కోట్ల మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 69,014 పోలింగ్ కేద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశాతంగా, స్వేచ్ఛగా పోలింగ్ నిర్వహణకు 457 కేంద్ర సాయుధ బలగాలు కావాలని ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపారు. * ఎన్నికల ఏర్పాట్లపై గురువారం అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ, నగర పోలీసు కమిషనర్లతో సీఈఓ భన్వర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తారు. * రాష్ట్రంలో కొత్తగా 76 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. వారందరికీ ఈ నెలాఖరు నుంచి కలర్ ఫొటోలతో స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తారు. పాత ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నవారు కొత్తగా స్మార్ట్ కార్డు పొందాలంటే ఏప్రిల్ 1 నుంచి ఈ-సేవలో రూ.25 చెల్లించి పొందవచ్చు. -
యంత్రాంగం రెడీ
సాధారణ ఎన్నికలకు సర్వసన్నద్ధం 3,038 పోలింగ్ కేంద్రాలు సిద్ధం 12 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారుల నియూమకం ఏలూరు, న్యూస్‌లైన్: మార్చి నెలలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నిమిత్తం ఇప్పటికే 15మంది నోడల్ అధికారులను కలెక్టర్ నియమించారు. జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న పలువురు అధికారులు బదిలీ అయిన నేపథ్యంలో వారి స్థానంలో వచ్చిన వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతలను అప్పగిం చారు. ఇప్పటికే 12 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమిం చగా, నిడదవోలు, భీమవరం, ఉండి నియోజకవర్గాలకు నియమించాల్సి ఉంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతస్థారుు సమావేశానికి కలెక్టర్ సిద్ధార్థజైన్ హాజరై వచ్చారు. ఈ నెల 17న ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సమీక్ష నిర్వహించారు. ఎన్జీవోల సమ్మె ముగిసిపోవడంతో తహసిల్దార్లు గురువారం విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఈ నెలాఖరులోగా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. 22 నాటికి కమిటీల నియూమకం ఎన్నికల వ్యయ నియంత్రణ, మీడి యూ సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీల నియూమకాన్ని ఈనెల 22 నాటికి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిడదవోలు, భీమవరం, ఉండి నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారుల నియూమకం కూడా కొలిక్కి రానుంది. ఈవీఎంల భద్రత కోసం కలెక్టరేట్లో గోడౌన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 3,038 పోలింగ్ కేంద్రాలు సిద్ధం జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 3,038 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. అత్యధికంగా చింతలపూడి నియోజకవర్గంలో 245, పోలవరం నియోజకవర్గంలో 230, భీమవరం, తణుకు నియోజకవర్గాల్లో 220 చొప్పున, కొవ్వూరులో 174, నిడదవోలులో 196, ఆచంటలో 173, పాలకొల్లులో 177, నరసాపురంలో 161, ఉండిలో 212, తాడేపల్లిగూడెంలో 199, ఉంగుటూరులో 205, దెందులూరులో 217, ఏలూరులో 195, గోపాలపుర ం నియోజకవర్గంలో 214 చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఎన్నికలకు ముందే రెండు పీసీసీలు!
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేరువేరుగా రెండు పీసీసీలను ఏర్పాటు చేసే పనిలో కాంగ్రెస్ అధిష్టానం నిమగ్నమైంది. ఎన్నికల షెడ్యూల్ నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడకపోతే సమైక్య రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ప్రస్తుత పీసీసీకి తెలంగాణ ప్రాంతంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడం కష్టమవుతుందని, ఆ నాయకత్వాన్ని తెలంగాణ నేతలు ఆమోదించే పరిస్థితి ఉండదని అధిష్టానం అభిప్రాయ పడుతోంది. అందుకే రెండు పీసీసీల యోచన చేస్తోంది.