సాధారణ ఎన్నికలకు సర్వసన్నద్ధం
3,038 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
12 నియోజకవర్గాలకు రిటర్నింగ్
అధికారుల నియూమకం
ఏలూరు, న్యూస్‌లైన్:
మార్చి నెలలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నిమిత్తం ఇప్పటికే 15మంది నోడల్ అధికారులను కలెక్టర్ నియమించారు. జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న పలువురు అధికారులు బదిలీ అయిన నేపథ్యంలో వారి స్థానంలో వచ్చిన వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతలను అప్పగిం చారు. ఇప్పటికే 12 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమిం చగా, నిడదవోలు, భీమవరం, ఉండి నియోజకవర్గాలకు నియమించాల్సి ఉంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతస్థారుు సమావేశానికి కలెక్టర్ సిద్ధార్థజైన్ హాజరై వచ్చారు. ఈ నెల 17న ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సమీక్ష నిర్వహించారు. ఎన్జీవోల సమ్మె ముగిసిపోవడంతో తహసిల్దార్లు గురువారం విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఈ నెలాఖరులోగా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
22 నాటికి కమిటీల నియూమకం
ఎన్నికల వ్యయ నియంత్రణ, మీడి యూ సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీల నియూమకాన్ని ఈనెల 22 నాటికి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిడదవోలు, భీమవరం, ఉండి నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారుల నియూమకం కూడా కొలిక్కి రానుంది. ఈవీఎంల భద్రత కోసం కలెక్టరేట్‌లో గోడౌన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
3,038 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 3,038 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. అత్యధికంగా చింతలపూడి నియోజకవర్గంలో 245, పోలవరం నియోజకవర్గంలో 230, భీమవరం, తణుకు నియోజకవర్గాల్లో 220 చొప్పున, కొవ్వూరులో 174, నిడదవోలులో 196, ఆచంటలో 173, పాలకొల్లులో 177, నరసాపురంలో 161, ఉండిలో 212, తాడేపల్లిగూడెంలో 199, ఉంగుటూరులో 205, దెందులూరులో 217, ఏలూరులో 195, గోపాలపుర ం నియోజకవర్గంలో 214 చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
యంత్రాంగం రెడీ
Published Fri, Feb 21 2014 1:43 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement