భుగభుగలాడించిన ఎండసైతం డెల్టా వాసులకు మలయ మారుతమే అనిపించింది. తమ
అభిమాన నేత.. రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం గంటల తరబడి నిరీక్షించేలా
చేసింది. అల్లంత దూరం నుంచి జనబాంధవుడిని చూసినంతనే అభిమాన కెరటం ఉప్పొంగింది.
జననేతను గుండెలకు హత్తుకుంది. అప్యాయత.. అనురాగాల వర్షం కురిపించింది. జనహృదయ
స్పందనను చూసి చలించిపోయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమయాన్ని సైతం పట్టించుకోకుండా
వారితో మమేకమయ్యారు. అవ్వ, తాత, అమ్మ, నాన్న, అక్కయ్యలను ఆత్మీయంగా పలకరించారు.
జగనన్నా అంటూ అభిమానం చూపిన చెల్లెళ్లు.. తమ్ముళ్లకు అనురాగం పంచారు. వారందరికీ
నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అందుకు ప్రతిగా ‘మన పార్టీకే ఓటేస్తాం.. నిన్ను ముఖ్యమంత్రి
చేస్తాం’ అంటూ ప్రజలంతా జననేత చేతిలో చెయ్యేసి ముందుకు నడిపించారు.
సాక్షి, ఏలూరు :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పాలకొల్లు, భీమవరం, ఉండి నియోజకవర్గాల మీదుగా జనభేరి రోడ్ షో నిర్వహించారు. తొలుత పూలపల్లిలో జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి నాయకుడు ఎంవీ సూర్యనారాయణరాజు నేతృత్వంలో ప్రతినిధి బృందం కలిసింది. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలకమైన అంశాలపై ఒక నివేదికను వైఎస్ జగన్‌కు అందజేసిన ప్రతినిధి బృందం ఐదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేస్తామనే విషయూన్ని పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఖమ్మం జిల్లాతో ముడిపడి ఉన్న అంశాలు, నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో తలెత్తే అడ్డంకులు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధి బృందం సమర్పించిన నివేదికలో పలు సూచనలు చేసింది.
హారతులు పట్టిన మహిళలు
పూలపల్లిలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఇంట బస చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 10 గంటలకు రోడ్ షో ప్రారంభించారు. మహిళల హారతులు అందుకుని హౌసింగ్ బోర్డుకు చేరుకున్న ఆయన అక్కడ తన కోసం వేచివున్న వికలాంగులను ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులను ముద్దాడారు. కొద్దిదూరం వెళ్లగానే ఎదురైన మరో వికలాంగుడు వీరయ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి బ్యాంక్ వీధికి చేరుకోగా అభిమానులు ఆయనపై పూలవర్షం కురిపిం చారు. అంబేద్కర్ సెంటర్‌లో వైఎస్ జగన్‌ను కలసిన సుబ్బారావు అనే వృద్ధుడు ‘మన పార్టీ గెలిచి తీరుతుంది. ఏం అనుమానం లేదు’ అంటూ ఆనందంతో చెప్పాడు. కాన్వాయ్ రైల్వే గేటు సెంటర్‌కు చేరుకోగా, ముస్లింలు పూలవర్షం కురిపిం చారు.
రామారావుపేటలో మల్లిపల్లి విశ్వనాథం అనే వికలాంగుడిని ఆప్యాయంగా పలకరించి దేశాలమ్మ గుడి వద్దకు చేరుకున్న వైఎస్ జగన్‌కు స్థానికులు డప్పు వారుుద్యాల మోతల నడుమ ఘనస్వాగతం పలికారు. ధనాల దుర్గమ్మ, ఎస్.ఉమాశైలజ అనే వారు హారతులు ఇచ్చారు. వికలాంగులు అనిల్, వెంకటరమణలను వైఎస్ జగన్ పలకరించారు. పాలకొల్లు రామారావుపేటలో ఓ వృద్ధురాలిని జననేత పలకరించగా, వయసు మీదపడటంతో చూపు మందగించిందని చెప్పిన ఆ వృద్ధురాలు ‘జగన్‌బాబు ఎక్కడున్నారు’ అని ఆయననే అడిగింది. దీంతో ఆయన ఆమె చెయ్యి పట్టుకుని ‘నేనేనమ్మా మీ జగన్‌ని’ అని చెప్పడంతో ఆ వృద్ధురాలు ‘మా బాబే.. అచ్చం మీ నాన్నను చూసినంత ఆనందంగా ఉందయ్యా’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బరుు్యంది.
అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్, గాంధీబొమ్మ సెంటర్ నుంచి పూలపల్లి, భగ్గేశ్వరం, లంకలకోడేరు, శివదేవుని చిక్కాల మీదుగా వీరవాస రం వరకు రోడ్ షో నిర్వహించారు. కాం గ్రెస్ పార్టీ పాలకొల్లు పట్టణ మాజీ అధ్యక్షుడు సిరితోట రాఘవులు, కొత్తపేట సర్పం చ్ దాసరి లాజరు, 21వ వార్డు టీడీపీ నేత ఎం.సింహాచలం 200 మంది అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరవాసరం సరిహద్దులో భీమవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గ్రం ధి శ్రీనివాస్ నేతృత్వంలో అశేష జనవాహిని ఘన స్వాగతం పలికింది. మత్స్యపురి రైతులు ఎండిపోయిన వరి దుబ్బులను తీసుకొచ్చి జననేతకు చూపించారు. తాము ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలను వివరించారు. అనంతరం శృంగవృక్షం, పెన్నా డ, విస్సాకోడేరు, గొరగనమూడి మీదుగా రోడ్ షో భీమవరం చేరుకుంది.
పార్టీ ఏలూ రు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, పార్టీ రాష్ట్ర నాయకులు విజయచంద్ర తదితరులు కలిశారు. పార్టీ నేత వేగిరాజు రామకృష్ణంరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, వేగేశ్న కనకరాజుసూరి కాన్వాయ్‌కు స్వాగతం పలి కారు. భీమవరంలో రోడ్ షో చేసిన వైఎస్ జగన్ ప్రకాశం చౌక్‌నుంచి గరగపర్రు, పిప్పర, అత్తిలి మీదుగా తణుకు పట్టణానికి చేరుకున్నారు. శనివారం రాత్రి అక్కడ బస చేశారు. ఆయన వెంట వైఎస్సార్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం నియోజకవర్గ సమన్వయకర్త కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ కేంద్రపాలక మం డలి సభ్యులు కొయ్యే మోషేన్‌రాజు,
ఎమ్మె ల్సీ మేకా శేషుబాబు, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త అల్లు వెంకటసత్యనారాయణ, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కండిబోయిన శ్రీనివాసరావు, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు, మేడిది జాన్సన్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల శ్రీహరి, వీరవాసరం మండల నాయకులు కోటిపల్లి బాబు, పాలకొల్లు మునిసిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి యడ్ల తాతాజీ, నాయకులు ముచ్చర్ల శ్రీరామ్, కోడే యుగంధర్ తదితరులు ఉన్నారు.