నేడు వైఎస్సార్ జనభేరి
నేడు వైఎస్సార్ జనభేరి
Published Thu, Apr 24 2014 1:22 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
ఏలూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నిడదవోలు, పోల వరం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ జనభేరి సభల్లో ఆమె ప్రసంగిస్తారు. గురువా రం ఉదయం 9 గంటలకు నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండ లం అన్నవరప్పాడులో బయలుదేరి 10గంటలకు పెరవలి చేరుకుం టారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడినుంచి నేరుగా పోలవరం వెళతారు. సాయంత్రం 4గంటలకు పోలవరంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 6 గంటలకు తాళ్లపూడి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. జనభేరి సభలకు అన్ని ఏర్పాట్లు చేశామని, విజయమ్మ రాక కోసం జనం ఎదురుచూస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు చెప్పారు.
Advertisement
Advertisement