తుంగభద్రపై తెగని పంచాయితీ ! | Contention to release water on tungabhadra | Sakshi
Sakshi News home page

తుంగభద్రపై తెగని పంచాయితీ !

Published Sat, Feb 8 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

Contention to release water on tungabhadra

సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర నీటి వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య వివాదం ఒక కొలిక్కి రావడంలేదు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో నీటి విడుదలపై రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ ఏడాది తుంగభద్ర ప్రాజెక్టు నీటిని ఇంకా వాడుకోవడానికి రాష్ట్రానికి కోటా ఉన్నప్పటికీ ఆ నీరు విడుదల చేయకూడదని కర్ణాటక అభ్యంతరం చెబుతోంది. దాంతో కెసి కెనాల్ పరిధిలో పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని రాష్ర్ట ఉన్నతాధికారులు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. మరోవైపు తనకు అదనంగా నీరు కావాలని పట్టుబడుతోంది.

సమావేశంలో ముఖ్యాంశాలు...
-     తుంగభద్ర హైలెవెల్ కెనాల్‌తో పాటు కెసి కెనాల్ ఆయకట్టుకు 6.5 టిఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంది.
 -    ఈ ఏడాది ఇప్పటి వరకు 5.5 టిఎంసీల నీటిని రాష్టం  ఉపయోగించుకుంది. ఇంకా ఒక టిఎంసీ ఉపయోగించుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement