తుంగభద్రపై తెగని పంచాయితీ !
సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర నీటి వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య వివాదం ఒక కొలిక్కి రావడంలేదు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో నీటి విడుదలపై రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ ఏడాది తుంగభద్ర ప్రాజెక్టు నీటిని ఇంకా వాడుకోవడానికి రాష్ట్రానికి కోటా ఉన్నప్పటికీ ఆ నీరు విడుదల చేయకూడదని కర్ణాటక అభ్యంతరం చెబుతోంది. దాంతో కెసి కెనాల్ పరిధిలో పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని రాష్ర్ట ఉన్నతాధికారులు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. మరోవైపు తనకు అదనంగా నీరు కావాలని పట్టుబడుతోంది.
సమావేశంలో ముఖ్యాంశాలు...
- తుంగభద్ర హైలెవెల్ కెనాల్‌తో పాటు కెసి కెనాల్ ఆయకట్టుకు 6.5 టిఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంది.
- ఈ ఏడాది ఇప్పటి వరకు 5.5 టిఎంసీల నీటిని రాష్టం ఉపయోగించుకుంది. ఇంకా ఒక టిఎంసీ ఉపయోగించుకోవాల్సి ఉంది.