
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2514కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,415 మంది సాంపిల్స్ పరీక్షించగా 62 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా శుక్రవారం కొత్తగా 51 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1731కి చేరింది. కరోనాతో ఇవాళ కృష్ణా నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 55కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 728 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
(దేశంలో ఒక్కరోజే 6088 కరోనా కేసులు)