సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 91,253 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 21,320 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1475372కి పెరిగింది.
గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున.. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున.. అనంతపురం, గుంటూరు, విశాఖ, ప.గో.జిల్లాల్లో 8 మంది చొప్పున.. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. నెల్లూరు జిల్లాలో ఐదుగురు.. వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మొత్తం 99 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 9,580 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 21,274 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 1254291 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 2,11,501 యాక్టివ్ కేసులు కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 1,81,40,307 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment