
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో గుంటూరు 9, చిత్తూరు 8, కడప 1, కృష్ణా 7, కర్నూలు 9,నెల్లూరు 9, విశాఖపట్నం 4, పశ్చిమ గోదావరి 1 ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో 9,628 మంది సాంపిల్స్ ని పరీక్షించగా 48 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. గత 24 గంటల్లో కొత్తగా 101 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చారయ్యారు. అందులో కర్నూలు నుంచి 47, అనంతపురం 37, కృష్ణా 5, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం నుంచి ముగ్గురు చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన కేసుల సంఖ్య 1353కు చేరుకుంది. కరోనాతో ఇవాళ ఒకరు మరణించగా మరణాల సంఖ్య 49కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 803గా ఉంది.
(దేశంలో 3,970 పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment