రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
Published Sat, Jul 1 2017 12:29 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
ఉంగుటూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి జాతీయ రహదారిపై ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. తెనాలికి చెందిన రైస్ మిల్ యజమాని గుర్రం వెంకట దుర్గాప్రసాద్ అతని బంధువులతో కలిసి తన మనవరాలు పెళ్లి చూపులు నిమిత్తం వైజాగ్ వెళ్లి ఇన్నోవా కారులో తెనాలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాదంపుడి సమీపంలోని దత్తాశ్రమం వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్రం వెంకట దుర్గాప్రసాద్(68), గుర్రం వెంకట రత్నం(55) దంపతులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను తెనాలి, తాడేపల్లిగూడెం ఆస్పత్రులకు తలరించారు.
ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జయింది. నిన్న విశాఖపట్నంలో ఎంతో ఆనందంగా పెళ్లి చూపులు ముగించుకుని తిరుగు ప్రయాణమయిన వీరిని మృత్యువు లారీ రూపంలో తీసుకుపోయింది. ఈ ప్రమాద ఘటన తెలుసుకుని ఇటు తెనాలి, అటు వైజాగ్ కు చెందిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement