క్రికెట్ బెట్టింగ్ వద్దన్నారని.. | couple suicide in chilakaluripet | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ వద్దన్నారని..

Published Thu, Mar 26 2015 11:18 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

క్రికెట్ బెట్టింగ్ వద్దన్నారని.. - Sakshi

క్రికెట్ బెట్టింగ్ వద్దన్నారని..

గుంటూరు : క్రికెట్ బెట్టింగ్ జోలికిపోయి నాశనం కావద్దని కొడుకును హెచ్చరించటమే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పిదం.  ఆ మంచి మాటలు నచ్చని కుమారుడు వారిపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన దంపతులు పురుగుమందు తాగి తనువు చాలించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో గురువారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన చెన్నుపాటి హరిబాబు(53), నాగేంద్ర(45) దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. వీరి కుమారుడు శ్రీహరి(30) బాధ్యత లేకుండా తిరుగుతుండటం వారికి నచ్చలేదు.

ఇటీవల క్రికెట్ బెట్టింగుల్లో పాల్గొంటూ ఇల్లు గుల్ల చేస్తున్నాడు. దీనిపై గురువారం ఉదయం కొడుకును మందలించారు. నచ్చని శ్రీహరి వారిపై చేయిచేసుకున్నాడు. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన హరిబాబు, నాగేంద్ర గురువారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా కొడుకు బాధ్యత లేకుండా తిరగడం, మరోవైపు ఆర్థిక సమస్యలు కూడా ఆత్మహత్య కారణమని గ్రామస్తులు అంటున్నారు.
(చిలకలూరిపేట)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement